Close

నరసాపురం, 06.08.2021 పత్రికా ప్రకటన యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, వారు సాధికారత సాధించే దిశగా డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.

Publish Date : 06/08/2021

నరసాపురం,
06.08.2021 పత్రికా ప్రకటన యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, వారు సాధికారత సాధించే దిశగా డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.

నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ ఎంపి నిధులతో నిర్మించిన డిజిటల్ కమ్యూనిటీ బిల్డింగ్ ను శుక్రవారం కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, సబ్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తో కలిసి పరిశీలించారు. మూడు అంతస్తులుగా నిర్మించిన డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ లోని అన్ని గదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బిల్డింగ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి మొక్కలను నాటి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్నారు. మూడవ అంతస్తులో ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రామ సమైక్య సమావేశ గదులను పరిశీలించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న నైపుణ్య అభివృద్ధి శిక్షణ ద్వారా ఎక్కువమంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారు సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ లో శిక్షణ ఇచ్చే కోర్సులపై ముందుగా షెడ్యూల్ ను విడుదల చేయాలన్నారు. మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలలో నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు వీటిలో భాగంగా కుట్టుమిషన్ శిక్షణ, అల్లికలు, కంప్యూటర్ లాంగ్వేజ్ వంటి స్వల్పకాలిక కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు వృత్తిలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించి వారు స్వసక్తితో ఆర్థిక పురోగతి సాధించేలా తీర్చిదిద్దాలన్నారు.ఇప్పటికే ఉషా ఇంటర్నేషనల్ సంస్థ కుట్టు మిషన్ శిక్షణను, రాధా మాధవ్ ఐటీ కంపెనీ కంప్యూటర్సుపై ఐటీ శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరం అయిన అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉండేలా తీర్చి దిద్దాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. గదులలో ఇంటర్నెట్, వైఫైతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను సూచించారు.భవనంలోనే అంగనవాడి సెంటర్ ను ఏర్పాటు చేయడం ద్వారా శిక్షణకు వచ్చే ఐదు సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు ఉపయోగకరంగాను, టేక్ కేర్ సెంటర్ గాను ఉపయోగపడుతుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు వెల్లడించారు. త్వరలో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున డిజిటల్ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించే కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.

ఈ పర్యటనలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ హిమాన్ష్ శుక్లా, సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్,డి. ఆర్.డి. ఏ.ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.ఉదయ భాస్కర రావు, పంచాయతీ రాజ్ యస్.ఇ. జి.చంద్ర భాస్కర రెడ్డి, ఈ ఈ కె. రామా కాంతారావు,డి.ఇ. కె.రామ స్వామి, తహశీల్దారు వి. మల్లి ఖార్జున రెడ్డి,యం.పి.డి.వో యన్.వి.యస్. ప్రసాద యాదవ్,గ్రామ సర్పంచ్ శ్రీమతి కొల్లాటి.కనక దుర్గ, ఏ.ఇ వై.వి. ఆర్.నాగేశ్వర రావు, ఏ.పి.యం.శ్రీమతి పిప్పళ్ళ.పద్మ,పేరాల.మోహన్, కొల్లాటి.నాగ రాజు , తది తరులు పాల్గొన్నారు.

సమాచార శాఖ.నరసాపురం.

PressRelease