Close

నరసాపురం. 04-02-2022. ప్రెస్ నోటు. ఆక్వాయూనివర్సిటీ ,పోర్టు , ఫిషింగ్ హార్బరు, ఉభయ గోదావరి జిల్లాల ను కలుపుతూ వశిష్ఠ వారధి నిర్మాణ పనుల స్థలాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్,

Publish Date : 04/02/2022

నరసాపురం. ఫిబ్రవరి.04,2022.

ప్రెస్ నోటు.

ఆక్వాయూనివర్సిటీ ,పోర్టు , ఫిషింగ్ హార్బరు, ఉభయ గోదావరి జిల్లాల ను కలుపుతూ వశిష్ఠ వారధి నిర్మాణ పనుల స్థలాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ శ్రీమతి పి.పద్మావతి, శాసనసభ్యులు ముదునూరు. ప్రసాదరాజు

తీర ప్రాంత రూపురేఖలు మార్చి మత్యకారుల జీవితంలో వెలుగులు నింపాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అన్నారు.నరసాపురం మండలం వేములదీవి, లిఖితపూడి, రాజుల్లంక గ్రామాల్లో ఆక్వా యూనిటీవర్సిటీ, ఫోర్ట్ ,ఫిషింగ్ హార్బర్, వశిష్ఠ వారధి నిర్మాణాలకు సంబంధిత స్థలాలను, మ్యాపులను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు శ్రీ ముదునూరి. ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ శ్రీమతి పి. పద్మావతి తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ వి ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీరప్రాంతాన్ని అభివృద్ది చేసి మత్స్యకారులు కుటుంబాల్లో వెలుగులు,యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని జిల్లా కలెక్టర్ అన్నారు. నరసాపురం మండలం వేములదీవి ,లిఖితపూడి, గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న “ఆక్వా యూనివర్సిటీ” స్థలాలను, రాజు లంక గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాలు కలుపుతూ నిర్మిస్తున్న వశిష్ఠ వారధి స్థలాల పరిశీలన చేశామన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వలన మత్స్యకారుల వలసలు ఉండవని వారి జీవితాలలో వెలుగులు లభిస్తాయని కలెక్టరు శ్రీ ప్రసన్న వెంకటేష్ అన్నారు.

శాసన సభ్యులు ముదునూరి. ప్రసాదరాజు మాట్లాడుతూ, నరసాపురం తీరప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినా వశిష్ఠ వారధి ,ఫిషింగ్ హార్బర్, ఫోర్ట్ ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి వేగవంతంగా చేయాలని శాసనసభ్యులు ప్రసాదరాజు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ను కోరారు. జిల్లాలో ఏకైక తీర ప్రాంతమైన నరసాపురం కు ఫిషింగ్ హార్బర్, పోర్టు , ఆక్వా యూనివర్సిటీ, ఉదయ గోదావరి వశిష్ఠ వారధి నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయ స్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి నరసాపురం తీర ప్రాంతాన్ని విశేష కృషి చేస్తున్నారని శ్రీ ప్రసాద్ రాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శ్రీమతి పి. పద్మా వతి,డి యస్ పి పి. వీరాంజనేయ రెడ్డి,తహశీల్దార్ కందుల.బాజీ సత్యనారాయణ,యం.పి.డి. వో యన్.వి.యస్. ప్రసాద్ యాదవ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు బి.రాజ కుమార్, ఎఫ్ డిఓ ఏ డి ఏడుకొండలు, ఏ యం సి చైర్మన్ కొల్లాబత్తుల.రవి కుమార్, జెడ్ పి టి సి సభ్యులు బొక్కా. రాధాకృష్ణ, మాజీ ఆప్కాబ్ చైర్మన్ అండ్రాజు. చల్లా రావు, దొంగ. మురళీ కృష్ణ, వైస్ యం.పి.పి. వుంగరాల.రమేష్ నాయుడు,చాగంటి.సత్యనారాయణ, పప్పుల రామారావు, తిరుమాని. నాగ రాజు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తీర ప్రాంత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమాచార శాఖ.నరసాపురం.