Close

తేదీ. 27.8.2021 . ప్రతినెలా చివరి శుక్రవారం , శనివారం నిర్వహించే సిటిజన్ ఔట్ రిచ్ ప్రోగ్రామును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .

Publish Date : 27/08/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు, తేదీ. 27.8.2021 .

ప్రతినెలా చివరి శుక్రవారం , శనివారం నిర్వహించే సిటిజన్ ఔట్ రిచ్ ప్రోగ్రామును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .

శుక్రవారం ఏలూరు లోని బెనర్జీ పేట 7వ డివిజన్ బుద్ధపార్కు వద్ద నిర్వహిస్తున్న సిటిజెన్స్ ఔట్ రిచ్ ప్రోగ్రాం ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు . ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి మీ వాలంటీర్ మీకు తెలియజేస్తున్నారా ? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు జగనన్న విద్య దీవెన , వసతి దీవెన , వైఎస్సార్ సున్నా వడ్డీ , మహిళలకు సున్నా వడ్డీ , అమ్మ వడి , వాహన మిత్ర , జగనన్న విద్యా కానుక ,వైఎస్ఆర్ ఆసరా , తదితర పథకాలు ప్రజలకు వివరించి వీటి గురించి మీ వాలంటరీ తెలియజేశారా ? . ఈ పథకా ద్వారా లబ్ధి పొందారా ? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలు దగ్గరకు వెళ్లి ప్రతి నెల పెన్షన్ వస్తుందమ్మా ?. ప్రతి నెల ఒకటో తారీఖున ఇస్తున్నారా లేదా అని అడుగగా , ఆమె ప్రతినెల పెన్షన్ సక్రమంగా ఒకటవ తారీకున ఉదయమే ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. సచివాలయంలో పనిచేస్తున్న వార్డు పరిపాలన కార్యదర్శి , సంక్షేమ , అభివృద్ధి కార్యదర్శి , వార్డ్ ఆరోగ్య కార్యదర్శి , ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి , మహిళా బలహీన వర్గాల రక్షణ కార్యదర్శి , ప్రణాళిక నియంత్రణ కార్యదర్శి ,వార్డ్ ఎనర్జీ కార్యదర్శి , వార్డు మౌలిక వసతుల కార్యదర్శి , వార్డు రెవెన్యూ కార్యదర్శి , వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి , ఏం పని చేస్తారు వీరు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చారా ? సంబంధించిన పనులు మీ వార్డులో చేస్తున్నారా ? మీ గ్రామ సచివాలయం ఎక్కడ ఉంది ? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. మా వార్డులో లో పనిచేసే ఉద్యోగులందరూ మాకు తెలుసని , సచివాలయం ఇక్కడే ఉందని ,ఏ అవసరం వచ్చినా సచివాలయానికి వెళ్లి వారికి తెలియ చేయడం జరుగుతుందని ప్రజలు కలెక్టర్ కి వివరించారు . అనంతరం నూతనంగా నిన్న వివాహమైన కొత్తజంట ను జిల్లా కలెక్టర్ ఆశీర్వదించారు .

ఈ ఆకస్మిక పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి పిల్లం గోళ్ళ శ్రీ లక్ష్మి , 7 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పిల్లం గోళ్ళ
శ్రీ దేవి , ఏలూరు ఆర్డీవో శ్రీమతి పనబాక రచన ,ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్
డి. చంద్రశేఖర్ , అడిషనల్ కమిషనర్ బాపిరాజు , ఏలూరు తాసిల్దార్ సోమశేఖర్ , వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ , ఏలూరు వారిచే జారీ.