Close

తేదీ 27-12-2021 సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని గోదావరి సమావేశ మందిరంలో అర్జీ దారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Publish Date : 27/12/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు, తేదీ.27.12.2021.

అర్జీ దారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందనలో అర్జీలు స్వీకరించారు.
అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలు విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చినవారు ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఆయన అధికారులకు సూచించారు. అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు.
అర్జీలు స్వీకరణలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు హిమాషు శుక్లా , సూరజ్ గానోరే , పద్మావతి , డి ఆర్ వో డేవిడ్ రాజు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు స్పందన కార్యక్రమంలో 253 దరఖాస్తులు రాగా అందులో 90 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించి , 31దరఖాస్తులు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి, 22 దరఖాస్తులు పెన్షన్ లకు సంబంధించి , 28 దరఖాస్తులు పోలీసు శాఖకు సంబంధించి , 7 దరఖాస్తులు వైద్య శాఖకు సంబంధించి ,10 దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు సంబంధించి ,10 దరఖాస్తులు మత్యశాఖ కు సంబంధించి రాగా మిగిలిన శాఖలకు సంబంధించి నాలుగు , మూడు దరఖాస్తుల చొప్పున వచ్చాయని ఆయన తెలిపారు.
– – – – – – – – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ , ఏలూరు నుండి జారీ.