Close

తేదీ. 21.82021. ఏలూరు లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

Publish Date : 21/08/2021

పత్రికా ప్రకటన ,

ఏలూరు, తేదీ. 21.82021.

ఏలూరు లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

శనివారం ఏలూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డయాలసిస్ యూనిట్ , ప్రత్యేక నవజాతి శిశు చికిత్స కేంద్రం , బాలింతలు వార్డు లను ఆకస్మికంగా తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడారు.రోగులు ఎంత కాలం నుండి డయాలసిస్ చేయించుకుంటున్నారు , గతంలో వారి ఆరోగ్యం ఏవిధంగా ఉండేది, ప్రస్తుతం ఆరోగ్యం ఏ విధంగా ఉంది , డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఆరోగ్యం ఏమైనా మెరుగుపడిందా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు .

ప్రత్యేక నవజాతి శిశు చికిత్స కేంద్రం లో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల కు అందిస్తున్న వైద్య విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరు ఎన్ని రోజులైంది జన్మించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాలింతల వార్డులో తనిఖీ చేసి బాలింతల వార్డు లో ఎంత మంది బాలింతలు చికిత్స పొందుతున్నారు , వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలింతల కేస్
షిట్ లను పరిశీలించారు.

తదనంతరం ఆసుపత్రుల్లో అడ్మిషన్ రిజిస్టర్ ను పరిశీలించారు. రిజిస్టర్ లో పేషెంట్ ల యొక్క వివరాలు నమోదు గురించి పరిశీలించి పలు సూచనలు చేశారు . బాలింతల యొక్క కేస్ సీట్లను పరిశీలించి కేస్ షీట్ లో నమోదు చేయవలసిన విషయాలపై డాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో బాలింతలకు ఆవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా 0 పాజిటివ్ రక్తం నిల్వలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని DCHS ను ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో DCHS శ్రీ ఏ వి ఆర్ మోహన్ , ఆసుపత్రి ఆర్ ఎం ఓ , పి. శ్రీనివాస్ , డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – — – – —- – – సమాచార పౌర సంబంధాల శాఖ , ఏలూరు నుండి జారీ.