జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వెళుతున్న సమయంలో కలెక్టరేట్కు తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన పిప్పళ్ళ చంద్రమ్మ

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేదీ. 1.9.20 21 .
జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వెళుతున్న సమయంలో కలెక్టరేట్కు తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన పిప్పళ్ళ చంద్రమ్మ ను చుసి ఆమెను అక్కున చేర్చుకుని అమె సమస్య సాదరంగా విన్నారు . ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని లోనకు తీసుకువెళ్లి జాయింట్ కలెక్టర్ చాంబర్లో సోపాలో కూర్చోబెట్టి ఆమెకి మంచినీరు బాటిల్ అందించారు. ఆమె కలెక్టరేట్ కు రావడానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ వయస్సు లో నీవు ఇంత పైకి ఎందుకు ఎక్కవమ్మా నీవు వచ్చావని తెలిసుంటే నేనే క్రింది కి దిగి నిన్ను కలిసి నీ సమస్యలు తెలుసుకునే వాడిని కదా అని ఆమె తో కలెక్టర్ అన్నారు. ఆమెకు సంబంధించిన భూ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి )శ్రీ హిమాన్సు శుక్లా తదితరులు ఉన్నారు .
– – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు నుండి జారి.