గుంటుపల్లి గుహలు (కామవరపుకోట)
గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామము. చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది. జీలకర్రగూడెం గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిధిలో ఉన్నాయి.ఈ బౌద్ద గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి. గుంటుపల్లి నుండి దాదాపు మూడు కీలో మీటర్లు వెళితే కాని జీలకర్రగూడెం రాదు జీలకర్ర గూడెం మీదుగానే కొండ పైకి మార్గం ఉంది.
1.గుహాలయము – క్రీ||పు ౩-2 శాతాబ్తాల మధ్య కాలమునకు చెందిన ఈ చైత్యము అతి ప్రాచీనమయునది.వర్తులాకారముగా ఉన్న గుహ చివరి భాగము స్దుపము కలిగియున్నది. స్దుపము చుత్తునూ సన్నని ప్రదక్షిణాపధము కలదు. దీనిని ప్రస్తుతము ఈ ప్రాంత ప్రజలు ధర్మలింగేశ్వర దేవాలయముగా పేర్కొనుచున్నారు. వర్తలాకారముగా గుమ్మటమును పోలి ఉండు దీనిపై కప్పు నందు వాసములు చెక్క బడినది. ఈ గుహాలయమును బీహీరులోని సుగవాసములు చెక్కబదియున్నవి. ప్రాచిన కాలమున కర్రతో చేసిన కుతీరములను అనుకరించుట వలన అవసరము లేకపోయునను వాసములు చెక్కబడినవి.ఈ గుభాలయమును బీహారులోని సుధామ,లోమన్ఋషి గుహాలయముతో పోల్చవచ్చును.
2.పెద్ద బౌద్ద విహారము/అరామము – ఇది ఇసుకరాతి కొండ అంచునందు వేరువేరు పరిమానములలో వరుసగా తొలచిన గదుల సముదాయము. ఈ గదులయందు వర్షాకాలంలో బౌద్ద సన్యాసులు నివాస ముండేవారు. ప్రతి గదుల యందు వర్షపు నీరు పోవుటకు సన్న కాలువలను తొలచి ఉన్నారు. ఈ కాలువల ద్వారా వర్షపు నీరు విహారమవెనుక గల సహజ సిద్ధమయున పగులులోనకి ప్రవహిస్తుంది.
౩.చిన్న బౌద్ద విహారము /ఆరామము – ఇది కొండ పై భాగమున ఉన్న ఇసుకరాతి అందు తొలచిన ఐదు గదుల సముదాయము. కొన్ని గదులు మొరటుగా నిర్మించబడ్డాయు.కొన్ని గదులు పూర్తిగా నిర్మించబడలేదు. కాలక్రమంలో ఈ గదుల ముందు భాగము ప్రతికూల పరిస్థితులు వలన జీర్ణమై కూలిపోయుంది.