Close

ఏ సమస్యల నైనా సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యేకత కలవారు వెంకటరమణ రెడ్డి అని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు .

Publish Date : 26/07/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు ,తేదీ .26.7. 20 21.

ఏ సమస్యల నైనా సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యేకత కలవారు వెంకటరమణ రెడ్డి అని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు .
ఆదివారం రాత్రి మినీ బైపాస్ లోని శ్రీ కృష్ణ కన్వెన్షన్ సెంటర్ లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ వెంకట రమణ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు .

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ వెంకట రమణ రెడ్డి డెడికేషన్ ,మోటివేషన్ ఉన్నవ్యక్తి అని ,మృదు స్వభావం కలిగిన వారని ,చెప్పిన దానిని వెంటనే సమర్థవంతంగా చేసి చూపిస్తారని అన్నారు. పని చేసేటప్పుడు ప్రణాళిక బద్దంగా పనిని పూర్తిగా అర్థం చేసుకుని చేస్తారని ఆయన అన్నారు . వెంకట రమణ రెడ్డి వెళుతున్నారని అక్కడ రెండు, మూడు సంవత్సరాలలో చేసే పనులను 20 ,30 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .

బదిలీపై విశాఖపట్నం వెళుతున్న శ్రీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పని ఏ విధంగా చేయాలి అని పూర్తిగా అర్థం చేసుకోవాలని ,ఆ పనిని ప్రణాళికాబద్ధంగా చేపట్టి పూర్తి చేయవచ్చునని ఆయన అన్నారు. జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాల కోసం సుమారు నాలుగు వేల ఎకరాల భూ సేకరణ చేయడం ఒక మైలు రాయి అని అన్నారు.
కోవిడ్ మెదటి వేవ్ లో 18 వేల మందిని వేరే జిల్లాలకు పంపించడం , వారికి భోజనం , వసతి సౌకర్యాలు కల్పించడం మరో రికార్డు అని ఆయన అన్నారు . 2020 లో వరదల సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. గృహ నిర్మాణంలో కూడా చివరి స్థానంలో ఉన్న జిల్లా ను ప్రథమ స్థానం లోకి తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా పని చేయడం జరిగిందని ఆయన తెలిపారు . పనిని పూర్తి గా అర్థం చేసుకొని ఒక చక్కటి ప్లాన్ చేసుకున్నట్లయితే సులభంగా పని పూర్తి చేయవచ్చునని ఆయన .

ఈ వీడ్కోలు సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా , సూరజ్ ధనుంజయ్ లు , నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ , ట్రైనీ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ సంక్షేమం పద్మావతి , డి ఆర్ ఓ డేవిడ్ రాజు , జిల్లా అధికారులు , ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ , రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
అనంతరం శ్రీ వెంకటరమణ రెడ్డి ని ఘనంగా పులబొక్కేలు , శాలువాలతో ఘనంగా సన్మానించారు .
– – – – – – – – – – – – – – – –
సహాయ సంచాలకులు , సమాచార పౌర సంబంధాల శాఖ , ఏలూరు నుండి జారి.

PressRelease