Close

ఏలూరు, 09.08.2021. పత్రిక ప్రకటన మహిళల రక్షణకు వజ్రాయుధం లాంటి దిశ యాప్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రతి మహిళా డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) అన్నారు.

Publish Date : 09/08/2021

ఏలూరు,
09.08.2021.

పత్రిక ప్రకటన
మహిళల రక్షణకు వజ్రాయుధం లాంటి దిశ యాప్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రతి మహిళా డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) అన్నారు.

ఏలూరు సి.అర్.అర్.రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మహిళల భద్రత మరియు రక్షణ కొరకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశా యాప్ పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి శ్రీ ఆళ్ల నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యములో మహిళల రక్షణ, భద్రతకు దిశాచట్టం మరియు దిశాయాప్ ను రూపొందించామన్నారు. మహిళల రక్షణ కొరకు ఈ ప్రభుత్వం ఎల్లవేళల ముందు ఉంటుందని తెలిపారు. దిశా యాప్ అనేది మహిళల చేతిలో ఉన్న ఆయుధం లాంటిదని, ఆపద సమయాలలో రక్షణ కొరకు మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలను వేధించిన , దాడులు చేసిన కఠినంగా శిక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ చట్టాన్ని తీసుకునిరావటం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశామహిళా పోలీస్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు, దిశ పోలీస్ స్టేషన్లకు ఆధునిక మొబైల్ ద్విచక్ర వాహనాలను సమకూర్చామన్నారు. దిశ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం పట్ల మహిళల భద్రతకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు నిదర్శనంగా చెప్పవచ్చునన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా రూపొందించిన దిశా యాప్ ను ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంకో పదిమందికి ఈ యాప్ పట్ల అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. 2019,డిసెంబర్ 13న దిశ చట్టాన్ని చేసామని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ అమలులో ఉన్నప్పుడు ఫిబ్రవరి 11, 2020 నాడు మొదటి ఫోన్ కాల్ మన పశ్చిమగోదావరి జిల్లా నుండి రావడం జరిగిందని కాల్ అందుకున్న పోలీస్ అధికారులు నాల్గున్నర నిమిషాలలోనే చేరుకునిఇరవై నాల్గు గంటల్లో చార్జిషీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. మహిళలు ధైర్యంగా అర్ధరాత్రి సమయంలో కూడా ఇంటికి క్షేమంగా చేరుకునేలా దిశ యాప్ ఒక తండ్రిగా, అన్నగా తోడు ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఏడు లక్షల యాభై వేల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారని మంత్రి అన్నారు. మహిళల రక్షణకు రూపొందించిన ఈ యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు కావాలన్నారు. ఏమహిళా రాష్ట్రంలో ఇబ్బందులు పడకూడదనే దిశా చట్టం, యాప్ ఒక ఆయుధంగా తీసుకుని వచ్చామని. SOS బట్టన్ నొక్కడం ద్వారా మహిళా భద్రత కు భరోసా ఇవ్వడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్ద బాబు మాట్లాడుతూ ప్రతి మహిళ భద్రత రక్షణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. దిశ యాప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా ప్రతి మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక గౌరవం, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. దీనిలో భాగంగా ఆసరా, చేయూత, గృహ పట్టాలు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మహిళలే అని గుర్తు చేశారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేది దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అంగన్ వాడి కేంద్రాలు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో పర్యవేక్షిస్తున్నామన్నారు. మహిళ శక్తి స్వరూపిణి అని ఆమె పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ భావం కలిగి ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా మహిళల ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని దీనిలో భాగంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగి ఉన్న బాలింతలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. మన జిల్లాలో ఏడు లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, జిల్లా జనాభా 40 లక్షలు ఉండగా సగ భాగం ఉన్న 15 లక్షలు మంది మహిళలు డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు మాట్లాడుతూ దిశ చట్టం, యాప్ ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో లో మహిళా పోలీస్ అందుబాటులో ఉంటారని అన్నారు. దిశ యాప్ ద్వారా కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి నేరస్థులను కస్టడీలోకి తీసుకుంటున్నామన్నారు. గతంలో గ్రామాలలో మహిళలు తమను వేధింపులకు గురి చేసిన వారిపై కేసుల నమోదుకు ముందుకు వచ్చేవారు కాదని, నేడు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు స్మార్ట్ సిటీ ( కార్పొరేషన్) చైర్మన్ శ్రీమతి బోద్ధనీ అఖిల, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీమతి ఈశ్వరి బలరాం, సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ దిశా యాప్ యొక్క ఉపయోగాలను గురించి కార్యక్రమంలో వివరించారు.
కార్యక్రమంలో దిశ యాప్ గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమములో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయ రామరాజు , ఏలూరు అర్.డి. ఓ శ్రీమతి పనబాక రచన, డిఎస్పీ లు డాక్టర్ దిలీప్ కిరణ్, కె.వి.సత్యనారాయణ ,శ్రీనివాసరావు , సుభా కర్, ఏలూరు టౌన్ సీఐలు బాల రాజాజీ,బి.అది ప్రసాదు,వర ప్రసాద్ లు ఎస్సైలు, మహిళా ఎస్ఐ లు మహిళ పోలీస్ సిబ్బంది గ్రామ/ వార్డు సచివాలయ మహిళ పోలీస్ సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థినులు, అంగన్వాడీ, ఆశా ఇతర విభాగాలకు సంబంధించిన మహిళా పోలీసులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్ దిశా యాప్ లైవ్ డెమో వివరించారు. సచివాలయంలో మహిళా పోలీస్ లకు మంచి గౌరవ మర్యాదలు వస్తున్నాయని, దిశయాప్ కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా భరోసా ఇస్తోందని తెలిపారు. మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చింది దిశయాప్ అనడంలో సందేహం లేదని తెలిపారు. మహిళా పోలీసులను మెమెంట్ తో సత్కరించారు. అనంతరం నిర్వహించిన దిశ స్కూటర్ లను,దిశ వ్యాన్ ను మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు.

సమాచార శాఖ ఏలూరు వారిచే జారీ చేయడమైనది.

 

PressRelease