Close

ఏలూరు, 03.09.2021 పత్రికా ప్రకటన పర్యాటకులను ఆకర్షించే విధంగా మాధవపురం వలస పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Publish Date : 03/09/2021

ఏలూరు,
03.09.2021
పత్రికా ప్రకటన

పర్యాటకులను ఆకర్షించే విధంగా మాధవపురం వలస పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

దెందులూరు నియోజకవర్గం, మాధవాపురం వలస పక్షుల కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, స్థానిక శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస పక్షులు కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా బోటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఆకర్షితులవుతారు. ఈ వలస పక్షుల కేంద్రానికి వచ్చే పక్షుల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి మరింత మెరుగైన వసతులు పర్యాటకులకు కల్పించాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.

గుడివాకలంక హరిత రిసార్ట్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా.

దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం గుడివాకలంక హరిత రిసార్ట్స్ ను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్థానిక శాసనసభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి తో కలిసి పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగాహరిత రిసార్ట్స్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

సమాచార శాఖ ఏలూరు వారిచే జారీ చేయడమైనది.