ఏలూరు, 03.09.2021 పత్రికా ప్రకటన గుడివాకలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ తక్షణమే అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.

ఏలూరు,
03.09.2021
పత్రికా ప్రకటన
గుడివాకలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ తక్షణమే అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.
దెందులూరు నియోజకవర్గం కొల్లేరు గ్రామాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, స్థానిక శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి తో కలిసి పర్యటించారు. గుడివాకలంక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ గ్రామం చాలా అందంగా ఉందని, కనుక సమయం ఉంటే అక్కడే ఎక్కువ సేపు గ్రామస్తులతో గడిపేవాడినన్నారు. ఎంతో కాలంగా గ్రామంలో అంబులెన్స్ అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గుడివాకలంక గ్రామస్తులు ఎదుర్కొంటున్న రహదారి అభివృద్ధి పనులను శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు రావడం జరిగిందని, త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని, పర్యాటక శాఖ ఏర్పాటు చేసే బోటింగ్ లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. గృహ నిర్మాణం విషయంలో కాలనీల ఎత్తు పెంచేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు.
స్థానిక శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గుడివాకలంక గ్రామంలో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. గుడివాకలంక నుండి చాటపర్రు మీదుగా ఏలూరు వెళ్లే రహదారి అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలో రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందని శాసనసభ్యులు హామీ ఇచ్చారు.
గుర్రాల రంగమ్మను ఓదార్చి సమస్యను సావధానంగా విని అక్కడికక్కడే అధికారులను ఆదేశించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా…
మాధవపురం వలస పక్షుల కేంద్రం నుండి గుడివాకలంక వెళ్లే రహదారిలో మొండుకోడు గ్రామస్తులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకు వచ్చారు. గ్రామ నివాసి గుర్రాల రంగమ్మ తనకు రేషన్ కార్డు ఇప్పించాలని కలెక్టర్ ను కోరగా అర్హతలు పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేయాలని తహాసిల్దార్ సోమశేఖర్ ను కలెక్టర్ ఆదేశించారు.
గ్రామస్తులతో మమేకమై చిన్నారులతో గడిపిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా..
గుడివాకలంక గ్రామంలో పర్యటించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా గ్రామస్తులతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకొని, చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయమంగళ ప్రభావతి రామారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సమాచార శాఖ ఏలూరు వారికే జారీ చేయడమైనది.