Close

ఏలూరు , తేదీ 25-02-2022. జిల్లాలో ఈనెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

Publish Date : 25/02/2022

పత్రికా ప్రకటన,

ఏలూరు , తేదీ .25.2.2022.

జిల్లాలో ఈనెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ని తన ఛాంబర్లో పల్స్ పోలియో పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ , ఆస్పత్రిలోనూ, పాఠశాలలు, అంగన్వాడీకేంద్రలలో, బస్ స్టేషన్ లు, రైల్యే స్టేషన్ లలో పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల వారందరికి రెండు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, 27వ తేదీన పోలియో చుక్కలు ఎవరైనా వేసుకోక పోయినట్లయితే వారికి 28, మార్చి 1 తేదీలలో ఇంటింటికి వెళ్లి 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 4,10,952 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని అంచనా వేయడం జరిగిందని వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 3,192 పోలియో వ్యాక్సిన్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 28,మార్చి 1వ తేదీలలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసేందుకు 6,222 టీంలను 12,444 మందితో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వారిని పర్యవేక్షించేందుకు 319 మంది రూట్ సూపర్వైజర్లు నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. పల్సపోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లాలో 13087 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు . పల్స్ ఫోను పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వి. డేవిడ్ రాజు , డియం &హెచ్ ఓ డాక్టర్ బి .రవి , డిస్టిక్ ఇమ్యునైజేషన్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.