Close

ఏలూరు, తేదీ. 18.2.2022. గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ సేవలు పొందేందుకు , వివిధ గ్రీవెన్స్ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది సరైనరీతిలో స్పందించి , చిరునవ్వుతో మాట్లాడి వారిసమస్యను. పరిష్కరించే విధంగా విధులు నిర్వహి0చాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ చూచించారు.

Publish Date : 18/02/2022

 

ఏలూరు, తేదీ. 18.2.2022.

గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ సేవలు పొందేందుకు , వివిధ గ్రీవెన్స్ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది సరైనరీతిలో స్పందించి , చిరునవ్వుతో మాట్లాడి వారిసమస్యను. పరిష్కరించే విధంగా విధులు నిర్వహి0చాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ చూచించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి నిర్వహించి ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఆలోచనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు . ప్రభుత్వ ఉద్యోగి పోస్ట్ మాన్ కాదని తన దగ్గరకు వచ్చిన దరఖాస్తు నాది కాదు అని మండలకు, జిల్లా కు పంపించడంకాకుండా ధరకాస్తును పరిష్కరించే విధంగా సంబంధించిన వారితో మాట్లాడి పరిష్కరించాలని ఆయన సూచించారు . ప్రతి రోజు ప్రతి మండలంలోని అన్ని గ్రామ సెక్రటేరియట్ లు, మున్సిపాలిటీలోని అన్ని వార్డు సెక్రటేరియట్ సంబంధించిన వివిధ శాఖల రిపోర్టులు జనరేటర్ చేసి సంబంధిత ఎంపీడీవో , తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు అందచేయాలని ఆయన సూచించారు . వివిధ శాఖలు అందించే సేవలకు సంబంధించిన దరఖాస్తులు 24 గంటలు, 48 గంటలలో సమయంలో పరిష్కరించవలసిన దరకాస్తులు రిపోర్టు జెనరేట్ చేసి సంబంధించిన అధికారులకు అందజేయాలని , వాటిపై తక్షణమే సంబంధిత అధికారి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

స్పందన సోమవారం 21వ తేదీ నుండి అన్ని సచివాలయాలు , మండలాలు, డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, స్పందనలో వచ్చిన దరఖాస్తులు గ్రామ ,వార్డు సచివాలయంలోనే పరిష్కారం కావాలని, అక్కడ పరిష్కారం కానివి మండల స్థాయిలో పరిష్కారం కావాలని ఆయన సూచించారు. డివిజన్, జిల్లా హెడ్ క్వార్టర్ కి సంబంధించిన సమస్య అయితే తప్ప మిగిలిన అర్జీదారులను జిల్లా కు పంపవద్దని ఆయన సూచించారు. వచ్చిన దరఖాస్తులు ఫాలోఅప్ చేసి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 24 గంటలు ,48 గంటలలో సమయం దాటి పోతున్నా వాటిని ప్రతిరోజు రిపోర్టులు జనరేట్ చేసి ఎంపీడీవో ,తాసిల్దార్ , మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వాలని , వారు వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్పందన లో వచ్చిన దరఖాస్తులను ఆయా దరఖాస్తు దారునితో ఎవరు మాట్లాడారు, ఏప్పుడు మాట్లాడారు, ఎండార్స్మెంట్ పైన సంబంధిత అధికారులు రాయాలని ఆయన చూచించారు. ఆ దరఖాస్తులు సక్రమంగా పరిష్కారం అయిందా లేదా మీరు పరిశీలించాలని ఆయన అన్నారు.
ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు, ఐటీ కి సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించి ప్రతిరోజు, వారంకు ఒకసారి, నెలకుఒకసారి జనరేట్ చేయవలసిన రిపోర్టులను వీరికి క్షుణ్ణంగా తెలియజేయాలని , దగ్గరుండి వీరి చేత ఆ రిపోర్టులు ఏవిధంగా జనరేట్ చేయించాలో వారికి చూపించాలని ఆయన సూచించారు. సంబంధిత డిపార్ట్మెంటల్ యాంకర్ పర్సన్ కు 10 మంది కి ఒక గ్రూపుగా చేసి వారికి ఇవ్వడం జరుగుతుందని వారికి ప్రతి విషయం తెలియ చేయాలని ఆయన అన్నారు.

వివిధ సేవల కు సంబంధించిన రిపోర్టులు , స్పందన రిపోర్టులు, గృహనిర్మాణం , ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ సంబంధించిన , సోషల్ వెల్ఫేర్ రిపోర్టులు , పంచాయతీ శాఖకు సంబంధించి , జిల్లా పరిషత్ కు సంబంధించి డిఆర్ డి ఏ కి, మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారులు వారికి తెలియజేసి వారు రిపోర్టు లు జనరేట్ చేసే విధంగా ఈరోజు ప్రిపేర్ చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ వి. డేవిడ్ రాజు , జిల్లా పరిషత్ సీఈవో హరిహారనాథ్ , dpo శ్రీమతి ఎన్. బాలాజీ , డ్వామా పి డి రాంబాబు, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు , ఎస్సీ కార్పొరేషన్ ఈడి పుష్పలత , తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి , సంబంధిత శాఖల యాంకర్ పర్సన్ లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – — – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.