Close

ఏలూరు, తేదీ.16.8.2021 కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని , విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేసేలా ఆధునిక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి కాళ్ళ కాళ్ళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు.

Publish Date : 16/08/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు, తేదీ.16.8.2021.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని ,
విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేసేలా ఆధునిక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి కాళ్ళ కాళ్ళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు.

సోమవారం దెందులూరు మండలం కొవ్వలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు – నేడు తొలిదశలో కోటి 60 లక్షల రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పించి ఆధునీకరించిన తరగతి గదులను ,ఓపెన్ జిమ్ ,బాస్కెట్ బాల్ కోర్టు , వాటర్ ప్లాంట్ లను మంత్రి ప్రారంభించారు.జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టానున్నారు. విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, టెస్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, స్కూల్ బెల్ట్, మాస్కులతో పాటు ఆక్సఫర్డ్ర్డ్ డిక్షనరీ అందిస్తున్నామని మంత్రి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని, అన్నారు. పేద , ధనిక మధ్య అసమానతలు తొలగించేందుకు పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు . జిల్లాలో మూడు దశల్లో 3 ,000 పాఠశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ,మొదటి దశలో 1100 పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పేద విద్యార్థులకు కూడా ధనవంతుల పిల్లల తో సమానమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పాఠశాలలో గల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలలపై దృష్టిసారించి ఈసారించి రాష్ట్ర లో అన్ని పాఠశాలల మార్పునకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. పాఠశాలల్లో విద్యుద్దీపాలు , విద్యార్థులకు బెంచీలు, చాక్ బోర్డ్, నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు, రక్షిత నీరు, పెయింటింగ్ ,వంటగది ,ఇంగ్లీష్ ల్యాబ్ ,ఆకర్షణీయమైన రంగుల బొమ్మలతో విద్యార్థులను మంచి పరిసరాలను పచ్చదనంతో పాఠశాలలో వాతావరణం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని దీనిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా సీబీఎస్ఇ సిలబస్ తో బోధన అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా56 వేల పాఠాశాలలో 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పాఠశాలలలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వలక్ష్యమన్నారు. అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఏడాది విద్యార్థి తల్లులకు 15 వేల రూపాయలువారి ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్థి తాను చదువుకుంటున్న పాఠశాలను దేవాలయంగా భావించాలని కోరారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మంత్రి పాఠశాల ఉపాధ్యాయులను కోరారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ నాడు నేడు మన బడి కింద జిల్లాలో 1117 పాఠశాలలో రూ. 275.69 కోట్ల తో మౌలిక సదుపాయాలు కల్పనచేయడం జరిగిందని ఆయన తెలిపారు . విద్య కోసం ఖర్చు చేసే ప్రతిరుపాయి భవిష్యత్ తరాల బాగుండాలని ఉద్దేశంతో అని ఆయన అన్నారు.విద్య భవిష్యత్తుకు మంచి పునాది ఆయన అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు సక్రమంగా వినియోగించుకోవడం తోపాటు , పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల టీచింగ్ కెపాసిటీ కూడా పెరగాలని అందుకు తగ్గట్టుగా వారికి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు . ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు .

దెందులూరు శాసనసభ్యులు
శ్రీ కొట్టారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ మారాలంటే వారికి మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని అందుకు తగ్గట్లుగా మన ముఖ్యమంత్రి చదువు ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలలో అభివృద్ధి చేయడంతోపాటు అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. దెందులూరు నియోజకవర్గం లోనే 89 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు . రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యా వ్యవస్థ లో సమూలమైన మార్పులకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. బడిలో కి వెళ్లి ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదని దేశంతో మంచి భోజనం కూడా ముఖ్యమంత్రి పెడుతున్నారని , అమ్మ ఒడి కింద 15 వేల రూపాయలు వారి తల్లుల ఎకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. దెందులూరు మండలం లో జూనియర్ కాలేజ్ మంజూరైందని భూసేకరణ కూడా పూర్తయిందని త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు .
అంతకుముందు కొవ్వలి కోపరేటివ్ సొసైటీ భవనం ప్రహరీ గోడ , షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి , వైధ్యా ఆరోవ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని , జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా, దెందులూరు శాశన సభ్యులు కొఠారి అబ్బయ్య చౌదరి విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ హిమాన్షు శుక్లా , డి ఈ ఓ సి వి రేణుక ఏలూరు ఆర్ డి ఓ పనబాక రచన , గ్రామసర్పంచ్ ఇంతేటి మధులత ప్రధాన ఉపాధ్యాయుడు నారాయణ రావు , తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – –

సమాచార పౌర సంబంధాలశాఖ ఏలూరు నుండి జారీ.