Close

ఏలూరు, తేదీ. 02.08.2021. స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబధిత అధికారులు తక్షణమే పరిష్కరించెలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.

Publish Date : 02/08/2021

పత్రికా ప్రకటన ,

ఏలూరు, తేదీ. 02.08.2021.

స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబధిత అధికారులు తక్షణమే పరిష్కరించెలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.

కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం , శాని టైజర్ వినియోగించడం వంటి ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ప్రజలనుండి అర్జీలు స్వీకరించారు. తీసుకునే ప్రతీ అర్జీకి అధికారులు జవాబుదారీ తనంతో పరిష్కారం చూపాలన్నారు.ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో వస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు పరిష్కారం చూపాలన్నారు.
స్పందన కార్యక్రమంలో ఈరోజు 313 దరఖాస్తులు వచ్చాయని అందులో ఎక్కువ దరఖాస్తులు రెవెన్యూశాఖ కు సంబంధించినవి కాగా తదుపరి దరఖాస్తులు గ్రామీణాభివృద్ధి శాఖ కి సంబంధించి నవి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినవి , పోలీస్ శాఖకు సంబంధించినవి , సర్వే శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి.మిగిలిన దరకాస్తులు వివిధ శాఖల కు సంబందినవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా. అంబేద్కర్ , హిమాన్షు శుక్లా, సూరజ్ ధనుంజయ్, పద్మావతి,
డి ఆర్ ఒ వి. డేవిడ్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – –
సమాచార శాఖ ఏలూరు నుండి జారీ చేయడమైనది.

PressRelease