Close

ఏలూరు, జనవరి 14: తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపాడు వద్ద శుక్రవారం జరిగిన లారీ ప్రమాదంలో క్షతగాత్రులై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా పరామర్శించారు.

Publish Date : 14/01/2022

పత్రిక ప్రకటన

లారీ ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

కొండ్రుపాడు వద్ద లారీ ప్రమాదంలో 4 గురు మృతి , మరో 10 మందికి గాయాలు ,

క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా

ఏలూరు, జనవరి 14:
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపాడు వద్ద శుక్రవారం జరిగిన లారీ ప్రమాదంలో క్షతగాత్రులై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధి కారులను వాకబు చేసి వారికి మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులతో ఆయన మాట్లాడుతూ వారు ఎక్కడనుంచి వచ్చింది,ఎంతమంది లారీలో ప్రయాణిస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎటువంటి ఆందోళన చెందవద్దని మెరుగైన వైద్యం అందిస్తామని వారిలో ధైర్యాన్ని నింపారు.

అనంతరం కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున విశాఖపట్నం జిల్లా దువ్వాడ నుంచి డిఎస్ఎఫ్ చేపల ఫీడ్ కంపెనీ నుంచి నారాయణపురం కు వస్తున్న లారీ ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న కార్మికుల్లో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా,మరో పది మంది గాయాలకు గురికావడం జరిగిందన్నారు.క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. యండి ఖలీల్ (25), వశికుర్ రెహ్మాన్(27), సవల్ అలమ్ (19)లకు అవసరమైన స్కానింగ్,ఎక్స్ రే లు తీసిన పిమ్మట వారికి ఆపరేషన్ చేయవలసి వుందనీ వైద్యులు నిర్ధారించడం జరిగిందని తెలిపారు.వారికి తదుపరి వైద్యం అందిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వలన ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారని , దీనిపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారని,దాని ఆధారంగా ప్రమాదానికి కారకులైనవారిపై ఐపిసి సెక్షన్లు కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారని , మృతుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రానికి పోస్ట్ మార్టం పూర్తి అవుతుందన్నారు.ప్రమాదంలో మరణించిన మృతులకు చెందిన కుటుంబసభ్యుల అభిష్టo మేరకు వారి అంత్యక్రియలు నిర్వహించడం లేదా వారి స్వస్థలాలకు మృత దేహాలు పంపించే ఏర్పాట్లను ఆర్డీవో,డిఎస్పీ లు అప్పగించడం జరిగిందన్నారు.

కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీవో పనబాక రచన, డిసిహెచ్ డా. ఏ.వి.అర్.మోహన్, అర్ యంవో డా. శ్రీనివాసరావు,ఏలూరు తహశీల్దార్ సోమశేఖర్ తదితరులున్నారు.

__________
సమాచార పౌరసంబంధాలశాఖ,
ఏలూరు వారిచే జారీ